విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని అప్పన్న దొరపాలెం పంచాయతీ తమ్మన్న మెరక గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నవ దంపతులైన కె.చిరంజీవి, వెంకటలక్ష్మిలు తమ ఇంటిలో ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది.. పెళ్లి అయ్యి 8 నెలలు కాకముందే దంపతులిద్దరూ విగతజీవులుగా పడి ఉండడం స్థానికులను కలిచివేస్తోంది. గ్రామానికి చెందిన కొప్పల చిరంజీవి, వెంకటలక్ష్మి దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా ఇద్దరూ తమ విధులు నిర్వహించుకొని ఇంటికి వచ్చారని స్థానికులు తెలిపారు.