కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్ మంగళవారం ఉదయం బోల్తాపడడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. గొల్లప్రోలు వాటర్ హౌస్ నుంచి కొత్త కాలనీకి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. రోడ్లు బురదగా ఉండడంతో వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది