అనంతపురంలో బుధవారం జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి రావాలని శాసనసభ్యులు పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె కొత్తచెరువులో మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గానికి సుమారు 175 బస్సులు ఏర్పాటు చేసామన్నారు.