“కార్పొరేట్, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే సీతారాం ఏచూరికి అర్పించే ఘనమైన నివాళి” అని సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు.సిపిఎం పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా శనివారం నగరంలోని ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభకు ఎం. రాజశేఖర్ అధ్యక్షత వహించారు.గఫూర్ మాట్లాడుతూ –ఆంధ్రప్రదేశ్‌లోనూ మోడీకి వత్తాసు పలికే ప్రభుత్వాల వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని, బాబు–జగన్–పవన్ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని గఫూర్ విమర్శించారు. ప్రతిపక