ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మేరీ మాత ప్రత్యేక ప్రార్థనలో భాగంగా టెంటు స్టేజి పనులు చేస్తుండగా విద్యుత్ వైరు వినపపైపులకు తగిలి ముగ్గురికి రాకేష్ బన్నీ విశ్వనాథరెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 వాహనంలో పొదిలి ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు.అందులో గొట్లగట్టు గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు మార్గ మధ్యలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు