రామాయణపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంటశాల, హాజరు పట్టిక, మధ్యాహ్న భోజన నాణ్యతను స్కూల్ పరిసరాల్లోని వసతి గదులు,ఫర్నిచర్, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.విద్యార్థినులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని తెలిపారు.విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని సూచించారు. ఆయా తరగతులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి టీచింగ్ విధానం, వారి విద్యాభ్యాసాలపై ఆరా తీశారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.