స్టీల్ ప్లాంట్ అసత్య ప్రచారాలు మానాలని కూటమి ఉన్నంతకాలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాటే ఉండదని ఎర్రచొక్క మిత్రుడు దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారని టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్ల రామ్మోహన్ కుమార్ అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఐటియు సిపిఎం పార్టీలు దీన్ని ఒక అలుసుగా తీసుకొని స్టీల్ ప్లాంట్ ని అమ్మేశారు కొనేశారు అన్న ప్రచారం జరుగుతుందని నిర్వాసితులు ఒకటి ఆలోచించాలని స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే దాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకున్నారని అన్నారు.