నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని చిట్యాల మండలం సురకంటి గూడెం నుంచి జాతీయ రహదారి 65 వరకు రూపాయలు రూ. 84 లక్షల వ్యయం తో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఊరూర పనుల జాతరలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు .అభివృద్ధి పనులు వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.