రాయదుర్గం నియోజకవర్గంలో గల అన్ని గ్రామాల్లో ఐదవ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని రూరల్ సీఐ వెంకటరమణ కోరారు. శనివారం మద్యాహ్నం పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మూడవ రోజు నిమజ్జనం ప్రశాంతంగా జరిందన్నారు. సుమారు 270 విగ్రహాలు నిమజ్జనం పూర్తి అయిందన్నారు. ఐదవరోజు సుమారు 90 విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు. విగ్రహాలను వాహనాల్లో తరలించే సమయంలో విద్యుత్ వైర్లు, నీటి కుంటలు, చెరువు వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.