చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు సాయంత్రం ధ్వజావరోహణం, అలాగే స్వామివారి మూలవిరాట్‌కు వడాయత్తు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు, ఉభయదారులు పాల్గొన్నారు.