పులివెందుల పట్టణంలోని సబ్ జైలును గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికారి సమస్త పక్రుద్దీన్ పులివెందుల సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా వంటశాల, జైలు పరిస రాలను పరిశీలించి రిమాండ్ ఖైదీలకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించారు. సమాజ నాగరికత తెలుసుకో కుండా క్షణికావేశంలో నేరాలకు పాల్పడితే అన్ని విధాల నష్టపోతారన్నారు. అలాంటి తప్పి దాలు చేయకుండా ఉండాలన్నారు. కార్యక్రమంలో పులివెందుల సబ్ జైలు సూపర్డెంట్, ప్యానల్ న్యాయవాది, పారా లీగల్ వాలంటరీ మరియు ఖైదీలు పాల్గొన్నారు.