మహాత్మ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ లను బాస్టర్డ్స్ అంటూ దూషించిన కొరియోగ్రాఫర్ శష్టి వర్మ ను బిగ్ బాస్ షో నుండి బయటకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం డిమాండ్ చేశారు. ఇదే అంశంపై గురువారం మధ్యాహ్నం నగరంలోని మార్కెట్ సెంటర్ వద్ద బిగ్ బాస్ టీవీ ను పగలకొట్టి, బిగ్ బాస్ పోస్టర్స్ ను దహనం చేశారు. అనంతరం మీడియాతో కరీం మాట్లాడుతూ గత మూడు నెలల క్రితం శష్టి వర్మ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయులను బాస్టర్డ్స్ అంటూ దూషించిన నేపథ్యంలో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో తాను ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.