ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ చింతాలమనే పల్లికి చెందిన విజయ్ అనే వ్యక్తి..ఓ నిరుద్యోగి అయినా వికలాంగుడునీ మోసం చేశాడు. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి కు చెందిన దుర్గం విజయ్ అనే వ్యక్తి ఉద్యోగంలో పెట్టిస్తానని ఆసిఫాబాద్ మండలానికి చెందిన వినేష్ అనే వ్యక్తిని నమ్మించాడు . ఒక లక్ష బేరం కుదుర్చుకొని వినేష్ వద్ద నుంచి రూ.లక్ష వసూలు చేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా రేపు,మాపు అంటూ...కాలయాపన చేస్తూ వచ్చాడు...8 నెలలు గడిచినప్పటికి ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితుడు మోసపోయానని గమనించి మీడియాను ఆశ్రయించాడు. తమకు న్యాయం చేయాలని వేసుకున్నాడు.