అరకులోయ మండలంలో కాఫీ బెర్రీ బోరర్ తెగులు సోకిన గిరిజన కాఫీ రైతులకు కేజీ కాఫీకి రూ.200 నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అరకులోయ మండలం చినలబుడు, పకనకుడ్డి గ్రామాల్లో పర్యటించారు. కాఫీ బెర్రీ బోరర్ తెగులు సోకిన కాఫీ తోటలను పరిశీలించారు. ఎకరం కాఫీ తోటలకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.