ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి వయసు సుమారు 55 సంవత్సరాలు ఉంటుందని కొత్తపేట సీఐ వీరయ్య శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 5 వ తేదీ మధ్యాహ్నం 03:30 నిమిషాల సమయంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తి పడిపోయి ఉన్నట్లు రాబడిన సమాచారం మేరకు అక్కడకు చేరుకొని వృద్ధుడును ప్రభుత్వాసుపత్రిలో చేర్పించడం జరిగిందన్నారు. అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. ప్రస్తుతం వృద్ధుడు మృతదేహం మార్చురీలో ఉందని మృతుని ఆచూకీ తెలిసినవారు కొత్తపేట పోలీసులను సంప్రదించాలని ప్రకటనలో సీఐ సూచించారు.