అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు.ముందుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భరత్ కుమార్ నాయక్ మరియు అధ్యాపకులు సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఆయన స్మృతికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భరత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన మనం ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటున్నామని విద్యార్థులు అటువంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రిన్సిపాల్ గారిని మరియు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు