గణేష్ నవరాత్రి ఉత్సవాల వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.కోరారు. నేడు సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులతో, ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యుత్, మున్సిపల్, పంచాయతీ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో ములుగు జిల్లా కేంద్రం తో పాటు ఏటూరు నాగారం లోని ముళ్ళకట్ట, రామన్న గూడెం, మంగపేట మండలాల్లో లో-లెవెల్ లో ఉన్న విద్యుత్ తీగలను పరిశీలించి తగు