కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పిఠాపురం సిఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామంలో వినాయక విగ్రహాలను సందర్శించారు. గణేష్ నవరాత్రులను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో జరపాలని, డీజే ప్రోగ్రామ్స్, బాణాసంచా వంటివి పెట్టకూడదని గణేష్ కమిటీ వారికి సూచనలు చేశారు. నిమజ్జల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని కూడా తెలిపారు అలాగే పిఠాపురం రూరల్ లో కూడా గణేష్ మండపాలు సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు