అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అదనంగా భూములు కేటాయించడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని బ్రాడిపేటలో గల సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబురావు మాట్లాడారు తక్కువ రేట్లకు అమరావతి రాజధాని ప్రాంతంలోని భూములను ప్రైవేట్ యూనివర్సిటీలకు ఏవిధంగా కేటాయిస్తారని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఏ కార్యక్రమం చేపట్టిన ప్రజలకు, చదువుకునే యువతకు మేలు చేసే విధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో పలువురు సిపిఎం నేతల పాల్గొన్నారు.