కూసుమంచి మండలం, లోక్యతండాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ రోటావేటర్ కిందపడి ఆరేండ్ల భువనేశ్వర్ బాలుడు మృతి చెందిన సంఘటన కాస్త ఆలస్యంగా వచ్చింది. లోక్యా తండా కు చెందిన రాంబాబు దీపిక లకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆదివారం సాయంత్రం తన ట్రాక్టర్ పై కుమారుడు భువనేశ్వర్ తో కలిసి తన పోలంలో ట్రాక్టర్ రోటావేటర్ తో దుక్కి దున్నుతూ ఉండగా ఒక్కసారిగా భువనేశ్వర్ ట్రాక్టర్ పైనుంచి జారి రోటోవేటర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.