కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని పెద్దముడియం మండలం సుద్దపల్లెలో శనివారం వినాయక చవితి పండుగ సందర్బంగా గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ సహకారంతో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా జమ్మలమడుగు రూరల్ సీఐ భాస్కర్ రెడ్డి , పెద్దముడియం ఎస్సై సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సుద్దపల్లె యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని.. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని వారు తెలిపారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన శేషు,బాలుని అభినందించారు.