కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి సిరిసిల్ల జాతీయ రహదారిపై రైతులు బేటాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం సరిపడా యూరియాను అందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియా మంజూరు చేయాలని కోరారు. రైతులు రోడ్డుపై బేటాయించడంతో ఇరువైపున రవాణా స్తంభించడంతో కామారెడ్డి పట్టణ పోలీసులు చేరుకొని రైతులను సముదాయించారు.