ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం వినాయక చవితి పండుగలు పురస్కరించుకొని ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహం అందర్నీ విశేషంగా ఆకర్షిస్తుంది. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా నెమలిపించాలతో వినాయకుడి విగ్రహాన్ని తయారుచేసి పూజలు నిర్వహించారు. దాదాపు 6000 నెమలిపించాలతో ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసినట్లుగా కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ వింతను తెలుసుకున్న స్థానిక ప్రజలు గణేష్ విగ్రహాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు.