కర్నూలు జిల్లా అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు కలెక్టరేట్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సిటీలోని ఆర్ఆర్ హాస్పిటల్ పక్కన ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారన్నారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్య దర్శి ఆకేపోగు వనములయ్య డిమాండ్ చేశారు.