వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పలనాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి పట్టణంలో వివిధ శాఖల అధికారులు గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో సిఐ అచ్చయ్య సమావేశం నిర్వహించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మండపాలకు సీసీ కెమెరాలు విద్యుతు అగ్నిమాపక పంచాయతీ పోలీస్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన కృష్ణానది వద్ద వినాయక నిమజ్జన స్థలాన్ని పరిశీలించారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.