పుట్టపర్తి పుర ప్రముఖులతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రజలు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. దేశం గర్వించదగిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ దేశాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు అధ్యక్షులతో సమావేశమై రికార్డు నెలకొల్పారన్నారు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మోడీ యాప్ పేరుతో ఆయన రైతులకు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు.