పుట్టపర్తి మండలం కప్పల బండ సర్వేనెంబర్ 315లో మాజీ నక్సలైట్లకు కేటాయించిన స్థలాన్ని లో చర్ల విజయభాస్కర్ రెడ్డి కబ్జా చేశాడని అతని కబంధహస్తాల నుంచి మా భూములకు విముక్తి కల్పించాలని పుట్టపర్తిలో ఆర్డిఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ నక్సలైట్ రాజారాం మాట్లాడుతూ 14 సంవత్సరాల క్రితం మాజీ నక్సలైట్లు మైన మేము పునరావాసం కోసం ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట భూమి కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకుంటే మమ్మల్ని నమ్మించి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి భూములను ఆక్రమించి అనర్హులకు అక్కడ లక్షలాది రూపాయలు తీసుకొని పట్టాలు ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.