కర్నూలు జిల్లా తుగ్గలి మండలం కడమకుంట్లలో శనివారంబురుగువాని కొండ వద్ద జొన్నగిరి, మాదనంతపురం గ్రామాలకుచెందిన 8 మంది పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.వారి వద్ద నుండి రూ. 19,480 నగదు, 8 సెల్ఫోన్లు, 4బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎస్సైమల్లికార్జున మాట్లాడుతూ, పేకాట, మట్కా వంటి అసాంఘికకార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని,గోప్యత పాటిస్తామని తెలిపారు. సీఐ పులిశేఖర్, డీఎస్పీవెంకటరామయ్య పోలీసులను అభినందించారు.