వరదయ్యపాలెంలో నిండుకుంటున్న వాగులు వరదయ్యపాలెం మండలంలో వారం రోజులుగా అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు నిండుకుంటున్నాయి. దీంతో కాలువలు ప్రవహిస్తున్నాయి. ఆరుతడి పంటలకు వర్షాలు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా ఉదయం పొడి వాతావరణం, రాత్రి వేళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సున్నపు కాలువ, పాముల కాలువ ప్రవహిస్తున్నాయి.