ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో "RTO Challan.apk, Traffic challan.apk , eChallan.apk,PM KISAN.apk, SBI Rewards.apk ఫైల్స్ వైరల్ అవుతున్నాయని వీటిపై అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. సందేశాలు APK ఫైల్ రూపంలో ముఖ్యంగా మీ వాట్సాప్ లలో మరియు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మీకు వచ్చే అవకాశం ఉంది. పై APK ఫైల్ క్లిక్ చేస్తే ఫోన్‌లో వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదం ఉందని ముందుగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి సైబర్ నేరాల నుండి రక్షణ పొందాలని కోరారు.