నేడు గురువారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కమ్యూనిటీ హాల్‌కు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిధిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘం కార్యవర్గ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.