ఖమ్మం నగరంలోని 48వ డివిజన్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్,అతని అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అల్లేటి సాయి కిరణ్ పై భౌతిక దాడి చేయడం హేయమైన చర్యని,దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. ఖమ్మం నగరంలోని వెంకటేశ్వర నగర్ లోని సాయి కిరణ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర మేయర్ నీరజ,ఏఎంసి చైర్మన్ యరగర్ల హన్మంతరావు,మిక్కిలినేని నరేందర్ తో కలిసి దుర్గాప్రసాద్ మాట్లాడారు.