పాణ్యం మండలం సుగాలిమెట్టు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు నుండి గద్వాల వెళ్తున్న పామ్ ఆయిల్ లారీ, ముందు వెళుతున్న టిప్పర్‌ను ఢీకొంది. లారీ ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, హైవే పెట్రోలింగ్ వాహనం పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.