వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలోని జాతీయ రహదారి 44 పై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెల్లడం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల సమాచారం.