నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు మరియు రైతు ధర్నా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఖతం అవుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదని తెలిపారు. అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.