సుబ్బమ్మ దేవి హై స్కూల్ నందు పిల్లలు ఆడుకునే ఆట స్థలాన్ని కబ్జాదారుల నుండి రక్షించాలని పిల్లల ఆట స్థలాన్ని స్కూలుకి అప్పగించాలని సిపిఎం ఏలూరు నగర కమిటీ నాయకులు జే గోపి, ఏం ఇస్సాకు డిమాండ్ చేశారు. ఏలూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సుబ్బమ్మ దేవి హై స్కూల్ పిల్లల ఆట స్థలాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కబ్జాదారుల కోరల నుండి కాపాడాలంటూ నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆచరణలో ప్రభుత్వాలు విఫలమవ్వడాన్ని నిరసిస్తూ సిపిఎం ఏలూరు నగర కమిటీ నాయకత్వంలో ఆక్రమణలు గురైన స్థలం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వద్ద ధర్నా నిర్వహించారు.