అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. బాన్సువాడ ఎస్ ఆర్ ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025- 26 విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపక పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. సోమవారం రెండు గంటలకు ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు మీడియంలో కంప్యూటర్ అప్లికేషన్, కామర్స్ సబ్జెక్టులలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 2న సాయంత్రం నాలుగు గంటల లోగా దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని, 3న కామరెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని అన్నారు.