ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువులోకి సోమవారం ఓ కారు దూసుకు వెళ్ళింది. హైదరాబాద్ కు చెందిన కొంతమంది యువకులు ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కంభం వచ్చారు. కంభం చెరువును సందర్శించేందుకు సరదాగా చెరువుకు వచ్చారు. కారు చెరువు ఒడ్డున నిలిపి చెరువు ప్రాంతంలో యువకులు సెల్ఫీ దిగుతూ సేద తీరారు. అకస్మాత్తుగా కారు చెరువులోకి దూసుకుపోవడంతో యువకులు అవాకయ్యారు. కారు చెరువు ఒడ్డున నిలిపి ఉంచిన సమయంలో కారు హ్యాండ్ బ్రేక్ వేయడం యువకులు మర్చిపోయారు. దీంతో కారు చెరువులోకి దూసుకుపోయింది. సంఘటన జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.