This browser does not support the video element.
విశాఖపట్నం: విశాఖ : జూ నుంచి రోడ్డుపైకి చుక్కల జింకలు
India | Sep 13, 2025
విశాఖ జూ పార్కు సమీపంలో చుక్కల జింకల సమూహం రోడ్డుపైకి వచ్చింది. ఇలా తరుచూ రావడం సర్వసాధరణమైపోయింది. అయితే చాలాసార్లు వాహనాల కింద పడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. జూ పార్కు నుంచి జింకలు బయటకు రాకుండా జూ అధికారులు చర్యలు చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న..అధికారులు పట్టించుకోవడం లేదు. శనివారం ఉదయం ఒక్కసారిగా 20కిపైగా చుక్కల జింకలు బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని జీవపరిరక్షణ ప్రియులు కోరుతున్నారు.