ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు రోడ్డు వైపు బోధనంపాడు సమీపంలోని ఇండస్ట్రియల్ పార్కులో విద్యుత్ వైర్లు గుర్తుతెలియని దొంగలు అపహరించకపోయిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సుమారు రెండు లక్షల రూపాయలు విలువ గలిగిన 25 స్తంభాల విద్యుత్ వైర్లను దొంగలు అపహరించినట్లు ఏఈ వేణుగోపాల్ తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.