వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి ఆరోపణలపై పలు ఫిర్యాదులు ఏసీబీ అధికారులకు అందగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ రాకేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో తనిఖీలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.