గుత్తి, గుత్తి ఆర్ఎస్ తోపాటు మండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా వినాయక పండుగ వాతావరణమే నెలకొంది. ముఖ్యంగా గుత్తి పట్టణంలోని మార్కెట్లు, వీధులు, బజార్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. వినాయకునికి ప్రీతిపాత్రమైన చెరుకు గడులు, ఎలక్కాయలు, అరటి గెలలు, అరటి ఆకులు, అరటిపండ్లు కొనుగోలు చేయడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి జనాలు తరలివచ్చారు. దీంతో ఎక్కడ చూసినా పండుగ సందడి, కొలాహాలమే కనిపించింది.