మోస్ర మండలం గోవురు గ్రామంలో పొలాల అమావాస్య పండుగను శనివారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. పండగ సందర్భంగా బసవన్నలకు ఉదయం నుండి శుభ్రం చేసి రంగులు అద్ది పూజలు నిర్వహించారు. సాయంత్రం 4. 30 గంటలకు రంగురంగుల డిజైన్లతో కూడిన వస్త్రాలను బసవన్నలపై కప్పి ఊరేగింపుగా తీసుకువెళ్లి హనుమాన్ ఆలయం వద్ద ఆలయం చుట్టూ బసవన్నల చేత ప్రదక్షిణలు చేయించారు.