సోమవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. జిల్లావ్యాప్తంగా వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను నేరుగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశాలు ఇచ్చారు ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.