రామకుప్పం మండలంలో 27 మందికి రూ.21.50 లక్షల CMRF చెక్కులను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, TDP మండల అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో తమను ఆర్థికంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 27 మందికి ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే వందలాదిమందికి CMRF ద్వారా ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు.