ఈనెల 10 వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ - సూపర్ హిట్ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో నగరంలోని అనంతపురం - బెంగుళూరు జాతీయ రహదారిలో టాటా మోటార్స్ ఎదురుగానున్న స్థలంలో ఏర్పాటు చేస్తున్న రెండు హెలిప్యాడ్ లలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పరిశీలించారు. హెలిప్యాడ్ లలో అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేసి సర్వం సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.