పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని కడప జిల్లా వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని రామిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు బోరెడ్డి. జగన్నాథ్ రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి సహకారంతో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వేంపల్లి పార్టీ ఆఫీస్ లో ఆయనకు మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి జగన్నాథ్ రెడ్డికి పదవి రావడం సంతోషమని చెప్పారు.