ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. కారుణ్య, ప్రత్యేక నియామక కోటాలో ఉద్యోగం పొందిన ముగ్గురికి గురువారం ఆమె నియామక పత్రాలను ఇచ్చారు. వీరిలో ఇద్దరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, మరొకరు దివ్యాగుల సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తారు. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థానానికి చేరుకునేలా పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.