ఐపీఎస్ అధికారి సంజయ్ ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో 10 11వ తేదీల్లో సంజయ్ ను అధికారులు విచారించనున్నారు. బుధవారం విజయవాడ జిల్లా జైలు నుండి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం గొల్లపూడి ఏసీబీ అధికారులు సాయంత్రం 6 గంటల వరకు విచారించనున్నారు. అనంతరం జిల్లా కోర్టుకు తరలించనున్నారు.