జగిత్యాల జిల్లా ధర్మపురి రాయపట్నంలోని గోదావరి నది వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన ఓ మహిళను అక్కడే ఉన్న పోలిస్ కానిస్టేబుల్ కాపాడాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కరీంనగర్ జిల్లా చొప్పదండి అర్నకొండకు చెందిన ఒ మహిళా శనివారం రాయపట్నం వద్ద ఉన్న గోదావరి వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించగా ధర్మపురి బ్లూ కోల్ట్ పోలీస్ రణధీర్ ఆమెను రక్షించారు.ఆమె మానసిక పరిస్థితిని గమనించి వెంటనే ఆమెను కాపాడారు. అనంతరం ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలను తెలుసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బంధువులకు సమాచారం ఇచ్చి ఆమెను అప్పగించారు.